శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

శాంతి కర్మ బుడగను మరింతగా ఎలా తెరవాలి, 6 యొక్క 4 వ భాగం

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
సరే, ఇప్పుడు మనం మళ్ళీ శాంతి గురించి మాట్లాడుకుందాం. శాంతి ఎందుకంత నెమ్మదిగా వస్తుంది? ప్రపంచ శాంతికి, యుద్ధానికి సంబంధించిన ఆ ప్రత్యేక కర్మ బుడగను సృష్టించడానికి ఎన్నో కర్మలు కలిసిపోయినందువల్ల. యుద్ధం చెలరేగడం సులభం, ఎందుకంటే బయట సమాజంలో, ప్రపంచంలో ఉన్న కర్మ, ఆ యుద్ధ బుడగ లోపల ఉన్న కర్మ లాంటిదే. వారు ఆ బుడగలోనే ఉంటారు, కానీ త్వరగా బయటకు విస్ఫోటనం చెందుతారు. అది నిండినప్పుడు, యుద్ధంలా విస్ఫోటనం చెందుతుంది. కానీ శాంతి కర్మకు సంబంధించిన బుడగ భిన్నంగా ఉంటుంది. యుద్ధ కర్మ అనే బుడగ లోపల చాలా శక్తివంతంగా ఉంటుంది, దానికి తోడు బయట ప్రపంచ ప్రజలను హత్య చేయడం, చంపడం అనే శక్తి కూడా తోడవుతుంది, అందుకే రెండింటి మధ్య అనుసంధానం కావడం సులభం.

మీరు అణుబాంబును చూసినట్లే, అది మరేదీ ఛేదించలేని ఒక అత్యంత ప్రత్యేకమైన పదార్థంతో కప్పబడి ఉంటుంది. కానీ అది తెరుచుకున్నప్పుడు, అది చంపుతుంది, నాశనం చేస్తుంది; ఇక ఎవరూ దాన్ని ఆపలేరు. కానీ, అణుబాంబు లోపల ఉండే అణు పదార్థం ఉండే పాత్ర లాంటి మరో పాత్రలో నీళ్ళు పోస్తే, జీవానికి నీరు అత్యవసరం అయినప్పటికీ, ఆ నీరు బయటకు కారదు. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉండే పదార్థం. అది మీకు తప్పక ఉండాలి, లేకపోతే మీరు చనిపోతారు. అయినప్పటికీ, మీరు దానిని అణు బాంబులోని కేంద్రక పదార్థానికి బదులుగా అణు బాంబు కంటైనర్‌లో ఉంచితే, నీరు కేవలం బయటకు కారిపోదు, అది కేవలం బాంబులా పేలిపోయి నీటిని అంతటా చిమ్మదు, లేదు. మీకు అది కావాలంటే, మీరు ఒక ట్యాప్ నిర్మించాలి లేదా ఏదైనా రంధ్రం వేయాలి. కానీ, ఏదో ఒక బటన్‌తో ఎలక్ట్రానిక్‌గా అనుసంధానించబడినది ఉంటే తప్ప, ఆ అణు కంటైనర్‌ను ఛేదించడం అసాధ్యం. మరియు మీరు ఒక బటన్ నొక్కినప్పుడు లేదా ఇది, అది చేసినప్పుడు, అప్పుడు అది ఒక్కసారిగా బయటకు వస్తుంది. కానీ నీరు సహజంగా బయటకు రావడం చాలా కష్టం, మీరు ఏదైనా రంధ్రం చేసి దానిని బిందువుల రూపంలో కారేలా చేస్తే తప్ప.

ఇప్పుడు, శాంతి అలాంటిదే. ప్రతిచోటా శాంతి వెల్లివిరుస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి చర్చలు లేదా శాంతి ఒప్పందాల గురించి మేము మీకు తరచుగా, చాలా ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాము. కానీ నిజమైన శాంతి, సంపూర్ణ శాంతి, పూర్తి శాంతి అంతా అలా రాదు. మనం ఏదైనా రంధ్రం వేయగలిగితే, ఆ అణు కంటైనర్‌లోని నీరు నెమ్మదిగా బయటకు రావాల్సి ఉన్నట్లే. మరియు ఈ శాంతి బుడగ తెరుచుకోవడానికి మనం తవ్వగల రంధ్రం శాంతే – కుటుంబంలో శాంతి, దేశాల మధ్య శాంతి, సకల జీవుల జీవితాలలో శాంతి. శాంతి కర్మ అనే బుడగలో మనం పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తూ పోలేకపోవడానికి కారణం, మన దగ్గర అందుకు కావలసిన సాధనాలు లేకపోవడమే. మా దగ్గర ఆ శాంతి సాధనం లేదు. శాంతి మాత్రమే శాంతికి జన్మనివ్వగలదు. మనం ఇంకా చాలా మందిని చంపుతూనే ఉన్నాం. మనం ఇప్పటికీ చాలా హత్యలు చేస్తున్నాం. మనతో పాటు నివసించే ఇతర జీవులను తినడాన్ని, చంపడాన్ని మనం ఇప్పటికీ సమర్థిస్తున్నాము.

మనం ఈ ప్రపంచాన్ని, మన జీవితాన్ని కేవలం అద్దెకు తీసుకున్నట్లే అనుభవిస్తున్నాము; జంతు మానవులు మరియు ఇతర ప్రాణులు కూడా అంతే. కాబట్టి మనమందరం ఈ ప్రపంచం అనే ఒక పెద్ద భవనంలో అద్దెకు ఉంటున్నాం; ఈ ప్రపంచం ఒక పెద్ద భవనం, మరియు మనం అందులో నివసించడానికి తాత్కాలికంగా ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అద్దెదారులం మాత్రమే. మీకు అది కనిపించదు, కానీ అది అలాంటిదే. ఇది చాలా వరకు దానిలాగే ఉంటుంది. మరియు మీరందరూ ప్రతిరోజూ పని చేస్తూ, సంపాదిస్తూ, సమస్యలను ఎదుర్కొంటూ చాలా తీరిక లేకుండా ఉన్నారు. కాబట్టి, ఎక్కువగా ఆలోచించి, ఆ విధంగా విశ్లేషించి, చెల్లించడం అసాధ్యమయ్యేంత వరకు పెరిగిపోతున్న అద్దెను ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి మీకు సమయం ఉండదు. కర్మ అనేది అద్దె లాంటిది, మనం చెల్లించాల్సిన అద్దె ధర లాంటిది. కానీ మీరు అందులో ఎంత ఎక్కువ కాలం జీవిస్తే, ఎంత ఎక్కువగా ఇది, అది చేస్తే, అంత ఎక్కువగా మీరు చెల్లించాల్సి ఉంటుంది. తప్పించుకోవడానికి దారి లేదు. మరియు మీరు భవనాన్ని కూడా పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు, సహజంగానే, మీరు ఇంటి యజమానికి మరింత ఎక్కువ, చాలా ఎక్కువ చెల్లిస్తారు. మనం చాలా ఎక్కువ చెల్లిస్తున్నాం. భూమి భరించగలిగే దానికంటే మనం ఎక్కువగా ఖర్చు చేస్తున్నాము. మనం అదంతా వృధా చేస్తాము. మనం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నీటిని వృధా చేస్తున్నాము. మనం జీవించడానికి దేవుడు సృష్టించిన అందమైన గాలిని మనం పాడుచేస్తున్నాము. మనం భరించగలిగే తక్కువ అద్దెకు అనుకూలంగా లేని ఇతర పనులు మనం చాలా చేస్తున్నాము.

ఇప్పుడు, శాంతి కర్మ ఇప్పటికే మన ప్రపంచంలోకి వచ్చింది. అందుకే సూర్యరాజు మీకు ఆ విషయం ప్రకటించాడు. పక్షి మానవులు, జంతు మానవులందరూ, ఉడుత మానవులు, సాలీడుల వంటి చిన్న కీటకాలు కూడా ప్రతిరోజూ వచ్చి నాతో, “శాంతి ఇక్కడ ఉంది” అని చెబుతాయి. నేను, “నాకు తెలుసు, నాకు తెలుసు” అని అంటాను. నేను ఇంకా కష్టపడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, మన ప్రపంచం యొక్క శాంతి కర్మను చుట్టి ఉంచిన శాంతి కర్మ అనే బుడగకు, దైవ కృప వలన, ఒకే అత్యంత శక్తిమంతుడిగా ఏకమైన త్రిమూర్తుల వలన, సన్మార్గంలోకి వచ్చి దయ, కరుణలను ఆచరిస్తున్న లౌకికుల వలన కొన్ని రంధ్రాలు చేయబడ్డాయి. అందువల్ల గ్రహం మెరుగైంది. అంటే శాంతి మరింత స్పష్టంగా కనిపిస్తోంది, కానీ అది ఇంకా సంపూర్ణం అయినట్లు కాదు. నేను ఇంకా ఆ గొప్ప సమయం కోసం ఎదురుచూస్తున్నాను.

శాంతి కోసం మీరు చేసే హృదయపూర్వక ప్రార్థనలు సహాయపడతాయి. మీ శాకాహార జీవనశైలి చాలా సహాయపడుతుంది. మీ కడుపులోని బిడ్డ పట్ల మీ దయ, ప్రేమ ఎంతో సహాయపడతాయి. ప్రతిదీ సహాయపడుతుంది. కాబట్టి మనం ఆ ఛేదించలేని బుడగలో కొన్ని రంధ్రాలు చేయగలిగాము, తద్వారా కొంత శాంతి శక్తి బయటకు వచ్చి మన ప్రపంచాన్ని ఆశీర్వదించి, అంచెలంచెలుగా ఇప్పటి వరకు శాంతిని నెలకొల్పగలదు. మొదలైనవి…

మధ్యప్రాచ్య దేశాలు కూడా, ఉదాహరణకు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై బాంబు దాడులను, యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించాయి. కానీ ఇరాన్ కేవలం తమ కోసమే సాకులు చెప్పలేదు. వారు లెబనాన్‌ను తమ సొంత తోబుట్టువులుగా భావిస్తూ, వారిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సాకుగా వాడుకున్నారు. అందువల్ల శాంతికి ఇకపై పెద్దగా సాకులు మిగలలేదు. అయినప్పటికీ, ప్రపంచ ప్రజలందరూ మారారు కాబట్టి, అంటే చాలామంది మారారు – నేను కోరుకున్నట్లు మెజారిటీ కాకపోయినా – మరింత దయగల హృదయాన్ని, మరింత కరుణామయ జీవనశైలిని అలవరచుకున్నారు, ఇతరుల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నారు, మరింత శాంతియుతమైన ఆలోచనలను, ప్రపంచం మొత్తానికి మరింత శాంతియుత మద్దతును కలిగి ఉన్నారు, మరియు వారి హృదయాలలో, వారి ఆలోచనలలో యుద్ధాన్ని మరింతగా ఖండిస్తున్నారు. మరియు వారు వేగన్లుగా మారారు. ఈ రోజుల్లో చాలా చాలా మంది, మునుపటి కంటే చాలా ఎక్కువ. వారు మునుపటి కంటే చాలా, చాలా,చాలా ఎక్కువగా వీగన్ ఆహారాన్ని తయారు చేస్తున్నారు. వారు మునుపటి కంటే చాలా ఎక్కువగా, మరింత చురుకుగా, మరింత ఆచరణాత్మకంగా, మరింత తార్కికంగా శాంతి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.

కాబట్టి మనం సంపూర్ణ శాంతి కోసం ప్రార్థించి, ఆశించవచ్చు, కానీ దానికి మనం కూడా తోడ్పడాలి. ఇల్లు కేవలం ఒకే ఇటుకతో కట్టబడదు. దీనికి చాలా చాలా ఇటుకలు కలిసి ఉండాలి, అలాగే సిమెంట్, నీరు, ఇసుక మొదలైన ఇతర పదార్థాలు కూడా అవసరం. శాంతికి మనం ఎన్నో విధాలుగా తోడ్పడాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది వేగన్ ఆహారం, వీగనిజం, ఎందుకంటే దానిలో శాంతి, ప్రేమ, కరుణ, జీవితం పట్ల ప్రేమ, జీవితానికి మద్దతు ఇవ్వడం, జీవితాన్ని రక్షించడం వంటివి ఇమిడి ఉంటాయి. అదే శాంతి. యుద్ధానికి వ్యతిరేకమైన శాంతికి కావలసిన అంశాలన్నీ ఇవే. కాబట్టి దాని గురించి ఆలోచించండి.

నాకు వేగన్ ఇష్టం అయినంత మాత్రాన, నేను మిమ్మల్ని వేగన్గా మార్చాలని ప్రయత్నించడం లేదు. అవును. అయితే అది సకల జీవుల, ముఖ్యంగా మానవుల ఉమ్మడి రక్షణ కోసమే. ఎందుకంటే యుద్ధాలు చేసేది, శాంతి నెలకొల్పేది మనుషులే. అందుకే శాంతి నెమ్మదిగా వస్తుంది, ఎందుకంటే శాంతి-కర్మ బుడగ పగిలి, మన లక్ష్యానికి, మన కోరికకు మద్దతుగా శాంతి శక్తి అంతటా వ్యాపింపజేయడానికి మనకు తగినన్ని రంధ్రాలు లేవు. కాబట్టి, దయచేసి వేగన్లుగా ఉండండి, పుట్టబోయే బిడ్డలను రక్షించండి, మరియు శాంతికి సంబంధించిన ప్రతిదానికీ మద్దతు ఇవ్వడం ద్వారా మీరు ప్రశాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన ఆలోచనలను కలిగి ఉండండి. హత్య చేయడంతో, అమాయకులను చంప డంతో దీనికి ఏమీ సంబంధం లేదు. అటువంటి దుష్ట కార్యానికి మద్దతు ఇచ్చేది ఏదీ లేదు.

నేను జంతు-ప్రజలు, తమాషాగా, ప్రేమగా ఉండేవాళ్ళు, లేదా పసిపిల్లలు, తమాషాగా, ప్రేమగా, తెలివిగా ఉండేవాళ్ళ క్లిప్పులను చాలా సేకరించడానికి ప్రయత్నిస్తాను – వాళ్ళందరూ, జంతు-ప్రజలు మరి మానవ శిశువులు, వాళ్ళు చాలా తెలివైనవారు. మరియు ఎవరికి తెలుసు, వారు ఒక సాధువుగా, ఒక రాష్ట్రపతిగా, ఒక శాస్త్రవేత్తగా, మీరు మరియు మీ పిల్లలు నివసించే సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా జన్మించవచ్చు. నేను మీ కోసం సేకరించి మన టీవీలో చూపించే క్లిప్పులన్నింటినీ మీరు చూసినప్పుడు, పుట్టకముందే ఈ అందమైన పిల్లలను, లేదా ఇంత ముద్దుగా, ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా ఉండే ఈ జంతు-మానవులను ఎవరైనా ఎలా చంపగలరో మీరు ఊహించలేరు. వాటిని చూస్తూ ఉండు, అప్పుడు నీ మనసు మారుతుంది.

ఎందుకంటే ఉదాహరణకు మనుషులు, ఎవరి సంఘటనలనైనా కేవలం చదవడం కంటే వాటిని చిత్రరూపంలో చూడటం ద్వారా మరింత బలమైన శక్తిని గ్రహిస్తారు మరియు గణనీయంగా ప్రభావితమవుతారు. అందుకే మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రతిదీ నిజాయితీగా, చిత్రాల రూపంలో చూపించడానికి ఎంతో ప్రయత్నించాము. అది సహాయపడుతుంది. ఇది చాలా చాలా చాలా మంది మానవులపై, కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది. వారు ప్రతిరోజూ మా సుప్రీమ్ మాస్టర్ టెలివిజన్‌లో దీనిని చూస్తే, వారికి మేలు చేసే ప్రతిదాన్నీ మేము వారికోసం సమకూరుస్తాము. కేవలం భౌతికమైనవే కాదు, మేము వైద్య సలహాలు, ఇంకా ఇతరత్రా విషయాలను కూడా సేకరిస్తాము. మానవులకు లేదా జంతు-ప్రజలకు కూడా మేలు చేసే ఏ విషయాన్నైనా మేము సేకరించి, వారికి చూపించి, మీ కోసం ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తాము.

Photo Caption: “మీరు అనుసరించే మార్గం మిమ్మల్ని ఇంటికి చేర్చేదేనని నిర్ధారించుకోండి.”

ఫోటో డౌన్లోడ్ చేయండి   

మరిన్ని చూడండి
అన్ని భాగాలు (4/6)
1
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-06-26
7875 అభిప్రాయాలు
2
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-06-27
6454 అభిప్రాయాలు
3
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-06-28
6108 అభిప్రాయాలు
4
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-06-29
5805 అభిప్రాయాలు
5
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-06-30
5732 అభిప్రాయాలు
6
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-07-01
5689 అభిప్రాయాలు
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
4:40

GLOBAL DISASTERS, SEPTEMBER 2026

458 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-10-26
458 అభిప్రాయాలు
12:15

No-Pain and Have-Pain Foods, Part 40

504 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-10-26
504 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-26
3159 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-26
688 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-10-26
647 అభిప్రాయాలు
36:42

గమనార్హమైన వార్తలు

128 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-25
128 అభిప్రాయాలు
మా ప్లానెట్ గురించి ప్రాచీన అంచనాలపై పలు భాగాల సిరీస్
2026-10-25
1260 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
Prompt
OK
డౌన్లోడ్